calender_icon.png 20 February, 2026 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి

20-02-2026 12:25:45 AM

  1. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ముగిసిన 8వ తెలంగాణ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

వేములవాడ, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): ఆటలలో గెలుపు ఓటములు సహజం అని గెలిచిన ఓడిన క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.వేములవాడ పట్టణంలో గత నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సౌజన్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారం నిర్వహిస్తున్న 08 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల గురువారం ముగిసాయి.

ఈ పోటీలలో బాలుర విభాగంలో మొదటి స్థానంలో ఖమ్మం, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి,మూడవ స్థానంలో వరంగల్, నాలుగవ స్థానంలో ఆదిలాబాద్ జిల్లాలు,బాలికల విభాగంలో మొదటి స్థానంలో మహబూబ్నగర్ ,ద్వితీయ స్థానంలో వరంగల్, మూడవ స్థానంలో నల్లగొండ, నాలుగవ స్థానంలో హైదరాబాద్ జిల్లాలు నిలువగా విజేతలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బహుమతులను ప్రధానం చేశారు.

వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు వేములవాడ పట్టణంలో నిర్వహించాడo అభినందనీయం అన్నారు..గతంలో జెడ్పీటీసీ ఎంపీపీ గా ఆలయ చైర్మన్ గా పనిచేసిన సమయంలో వాలీబాల్ పోటీలను నిర్వహించినట్లు విప్ తెలిపారు.విద్యార్థిని విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను ఈ వయసులోనే వేలికితీయడం పట్ల కోచ్లను అభినందించారు.. క్రీడాకారుల ఆటలు ఆడటం వలన జీవితంలో వచ్చే ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుంటారని అన్నారు.. అలాగే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతనికి వెళ్ళడం వలన స్నేహభావం పెరుగుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనీ క్రీడాకారులను వెలికి తీయడం కోసం సీఎం కప్ పేరిట ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సీఎం కప్ లో సుమారు 45 కు పైగా క్రీడలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మేటి ఫుట్ బాల్ ఆటగాడు మెస్సి నీ హైద్రాబాద్ తీసుకొచ్చి స్వయాన ఫుట్ బాల్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను చాటుకున్నారని అన్నారు.

గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ మార్చడానికి ముఖ్యమంత్రి సంకల్పించారని అందుకే గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు.వేములవాడ ప్రాంతంలో క్రీడాకారులకు ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని తెలిపారు.. అలాగే గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందని పేర్కొన్నారు..విజయం సాధించిన క్రీడాకారులకు విప్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు,వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చొప్పదండి ప్రకాష్,మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు, వైస్ ఛైర్మన్ కనికరపు రాకేష్,రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి హనుమంత రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గిన్నె లక్ష్మణ్,జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కుమార్ , జిల్లా కార్యదర్శి రాందాస్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు..