బీఆర్‌ఎస్ పాపాలను అప్పుడెందుకు ప్రశ్నించలే?
- ఇప్పుడు కవితను ప్రజలు నమ్మరు
- టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన పాపాలను కవిత అ ప్పుడే ప్రశ్నించి ఉంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మేవారని పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. తెలంగాణలో దోపిడీ పాలన చేసిందేవరో పల్లెల్లో ప్రజలను అడిగినా చెబుతారని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దోచుకున్న డబ్బులో వాటా దొరక్కపోతే ఇప్పుడు వచ్చి తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమ నిస్తున్నారని ఆమె తెలిపారు. కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డి పాలనే బాగుందని గతంలో మాట్లాడిన కవిత, ఇప్పుడు అదే నోటితో రేవంత్‌రెడ్డి పాలనపై విమర్శలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎర్ర బెల్లి స్వర్ణ మండిపడారు. బీఆర్‌ఎస్ హయాంలో మ హిళలపై జరిగిన దాడులు, అన్యాయాలపై కవిత ఎం దుకు ప్రశ్నించలేదని నిలదీశారు.






