15 April, 2026 | 5:17 AM

ఎవడు వాడు..

15-04-2026 01:28 AM

మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ (మోటివ్ ఫర్ మర్డర్) ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హీరోయిన్, అమెరికన్ నటి జో శర్మ, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హూ ఈజ్ ద కిల్లర్’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.

కథానాయకి జో శర్మ తాజాగా నటుడు బాలకృష్ణను కలిసి, తాజా పాటను చూపించగా, ఆయన చిత్రయూనిట్‌ను అభినందించారు. ‘ఎవడు వాడు..’ అనే క్యాచీ లైన్‌ను బాలకృష్ణ స్వయంగా హమ్ చేయడం విశేషం. ఈ సందర్బంగా జో శర్మ మాట్లాడుతూ.. బాలకృష్ణ లాంటి ప్రముఖ నటుడిని కలవ డం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా మే 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.