24 June, 2026 | 12:33 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

రంపచోడవరంలో భోగి యాక్షన్

15-04-2026 01:26 AM

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్నారు స్టార్ హీరో శర్వానంద్. ఆయన మరో పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ కోసం బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 1960లో ఉత్తర తెలంగాణ-, మహారాష్ట్ర సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఓ వాస్తవ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక కాగా ఈ సినిమా కోసం శర్వా ఇప్పటికే సరికొత్తటా ట్రాన్స్‌ఫర్మేట్ అయ్యారు. ఈ చిత్రంలో అను పమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తుండగా, రోహిత్ పాఠక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం అత్యంత కీలకమైన, భారీ షెడ్యూల్‌ను రాజమండ్రిలో ప్రారంభించింది.

ఇక్కడి రంపచోడవరం అడవుల్లోని సవాలుతో కూడిన ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ టఫ్ యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తుండగా, ప్రధాన తారాగణంతోపాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ సినిమా నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని టీమ్ తెలిపింది.

రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: కిషోర్ కుమార్ ఆరోకియా; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్; ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె; నిర్మాత: కేకే రాధామోహన్; రచన, దర్శకత్వం: సంపత్ నంది.