24 June, 2026 | 2:29 AM

అసంపూర్తిగా మహిళా సమాఖ్య భవనం

24-06-2026 01:27 AM
  1. బుడ్డారెడ్డిపల్లిలో నిలిచిపోయిన నిర్మాణ పనులు
  2. సమావేశాల కోసం మహిళల తిప్పలు

ఇటిక్యాల, జూన్ 23: మండల పరిధిలోని బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు పడకేసాయి. ఏళ్ల తరబడి పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తుండటంతో స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో, మహిళా సంఘాల సభ్యులు చిన్నపాటి సమావేశాలు నిర్వహించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రతి చిన్న మీటింగ్కు కూడా కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, భవనాన్ని అందుబాటులోకి తేవాలని గ్రామ మహిళలు డిమాండ్ చేస్తున్నారు.