15 April, 2026 | 3:56 AM

పిఠాపురంలో ఆ రోజే

15-04-2026 01:29 AM

సీనియర్ దర్శకులు మహేశ్ చంద్ర రూపొందిన ‘పిఠాపురంలో అలా మొదలైంది’. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం.

మహేశ్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్‌ఎం మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది.