వైభవంగా బోనాల ఊరేగింపు
24-06-2026 01:26 AM
గండీడ్ జూన్ 23 : మండల పరిధిలోని మన్సుర్ పల్లి గ్రామంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డప్పు వాయిద్యాలతో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తమ తమ మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి ఎదుల శంకరయ్య, వార్డు మెంబర్లు కొమిరి సూర్యం, ఎదుల చెన్నయ్య, బాలకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.






