31 July, 2026 | 4:20 AM

కుడి కాల్వకు నీటి విడుదల ఎప్పుడో?

31-07-2026 02:21 AM

ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

ఇటిక్యాల, జూలై 30: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి అనుసంధాన కాలువకు సా గునీరు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, కుడి కాలువకు మాత్రం నీరు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.

కాలువలో నీరు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందక ఇబ్బం దులు ఎదురవుతున్నాయని తెలిపారు. నాట్ల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెం టనే కుడి కాలువకు నీటిని విడుదల చేసి పం టలను కాపాడాలని రావులచెరువు, మునగాల, వేముల తదితర గ్రామాల రైతులు జలవనరుల శాఖ అధికారులను కోరుతున్నారు.