31 July, 2026 | 4:04 AM

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

31-07-2026 02:30 AM

వనపర్తి, జూలై 30 (విజయక్రాంతి): డబుల్ బెడ్రూం గృహాల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం మదనాపూర్లోని డబుల్ బెడ్రూం కాలనీని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్తో కలిసి ఆయన సందర్శించారు. కాలనీలోని సదుపాయాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.