బీసీల హక్కులకు భంగం కలిగిస్తే సహించం
- రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర
- ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): దేశంలో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యుడు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరా వు ఆరోపించారు. నీట్ విద్యార్థుల ఆందోళన సమయంలో సామాజిక మాధ్యమాల్లో రిజ ర్వేషన్లను ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, దాని వెనుక బీజే పీ మద్దతు ఉందని విమర్శించారు. బీసీల హక్కులు, రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కలిగించినా సహించబోమని ఆయన హెచ్చరించారు.
బీజేపీ, ఆర్ ఎస్‌ఎస్‌ల కుట్రలను ప్రజలు గుర్తించి తిప్పికొట్టాలని వీహెచ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా తెలంగాణ తరహాలో సమగ్ర కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అయో ధ్యలో జరిగిన అవినీతి, అక్రమాల అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రిజర్వేషన్ల వివాదాన్ని ముందుకు తెస్తుందన్నారు.
తిరుమలలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సమర్పించే హుండీ ఆదాయానికి సంబంధించిన లెక్కలు పారదర్శకంగా నిర్వహిస్తారని, అదే పారదర్శకత అయోధ్యలో ఎం దుకు కనిపించడం లేదన్నారు. రాముడిని రాజకీయాల కోసం ఉపయోగిం చ డం సరికాదన్నారు. సామాజిక న్యాయం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఒక్కటిగా నిలవాలని వీహెచ్ పిలుపునిచ్చారు.






