calender_icon.png 12 February, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ ఓటర్లకు ఏమైంది?

12-02-2026 01:24:45 AM

ఉమ్మడి జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు స్వస్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కానీ,  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ ఎంతో కీలకమైనప్పటికీ పురపారులు ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలం అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో సరాసరిగా ౭౦% ఓటింగ్ నమోదయింది. పల్లెటూరి ఎన్నికల్లో పల్లె ఓటర్లు 91 శాతం ఓట్లు నమోదు చేసుకోగా పట్టణాల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై అన్ని పార్టీలు టెన్షన్ పరమైనది. మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటికి ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును ఆశించిన స్థాయిలో వేయకపోవడంతో తక్కువ ఓటు ఏ పార్టీకి నష్ట కలుగుతుందో ఏ పార్టీకి లాభం చేకువస్తుంది అన్న చర్చ జరుగుతుంది.

  1. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
  2. ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్లు, రామగుండం సీపీ, ఎస్పీలు
  3. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

మంచిర్యాల/నిర్మల్/ఆదిలాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివి జన్లకు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట మున్సి పాలిటీల పరిధిలోని 89 వార్డులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఐదు గంటలలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకునే అవకా శాన్ని కల్పించారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ఓటింగ్ సరళిని పర్య వేక్షించిన అనంతరం బెల్లంపల్లిలోని మండల పరిషత్ ప్రాథ మికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠ శాల, క్యాతనపల్లి రామకృష్ణాపూర్ లోని ఆల్ఫోన్సా పాఠశా లల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి మంచిర్యాలలోని ఆర్‌బీహెచ్‌వీ, క్రిస్ట్ పాఠశాలలో ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. 

గట్టి పోలీసు బందోబస్తు...

మంచిర్యాల జిల్లా పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల పరిధిలోని 89 వార్డుల పరిధి లోని 128 పోలింగ్ లొకేషన్లలోని 444 పోలింగ్ కేంద్రాల వద్ద బుధ వారం పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిం చారు. ముందుగానే గుర్తించిన 179 సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతోపాటు ఎప్పటికప్పుడు స్పెషల్ టీంతో పెట్రోలింగ్ జరిపారు.

జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం నెమ్మదిగా ప్రారంభమైం ది. సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలో పోలింగ్ 68.60 శాతం జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,94,297 (పురుషులు 1,45,403, మహిళలు 1,48,867, ఇతరులు 27) మంది ఓటర్లుండగా పోలింగ్ ముగిసేసమయానికి 2,01,875 ( పురుషులు 99,759, మహిళలు 1,02,110, ఇతరులు 6) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ప్రశాంతంగా పోలింగ్: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీలలో నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసా గిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా మున్సి పాలిటీలలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని, సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం గేటు మూసివేసి, లోపల ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిప ల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 265 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను 68 పోలింగ్ కేంద్రాలు,

చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకుగాను 36 పోలింగ్ కేంద్రాలు, క్యాతనపల్లి మున్సిపా లిటీలో 22 వార్డులకు 45 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికల విధులు కేటాయించిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని, ఎన్నికల నిర్వ హణకు జోనల్, నోడల్ అధికారులు,

పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు, వీడియో, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెల్, ఇతర ఎన్నికల సంబంధిత సిబ్బందిని నియమించి, అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నామ న్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.

ఎన్నికల బందోబస్తును పర్యవేక్షించిన సీపీ

మంచిర్యాల టౌన్: జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో జరిగిన డివిజన్, వార్డు కౌన్సిలర్ ఎన్నికల బందోబస్తును రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి పరిశీలించారు. మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వీ, క్రిస్ట్ పాఠశాలల్లోని పోలింగ్ కేం ద్రాలను సందర్శించి ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రతాచర్యలు,

క్యూలైన్ల నిర్వహణ, వృద్ధులు, దివ్యాంగుల కోసం కల్పించిన ప్రత్యేక సదుపాయాలను పరిశీలించారు. ఓటర్లతో కూడా మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ సిబ్బంది సహాయపడ్డారా అని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ తదితరులున్నారు.

పోలింగ్ రోజు ప్రచారం చేసిన మంత్రి

చెన్నూర్: పోలింగ్ రోజు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో బైక్ పై తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెడుతూ, పోలింగ్ బూత్ ల వద్ద తిరుగుతూ ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ బుధ వారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు అంబేద్కర్ చౌక్ వద్ద నల్ల కండువాలతో నిరసన తెలిపారు.

కొందరు అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ప్రేమతో ఓట్లు వేయించుకోవాలే తప్ప ఇలా ప్రలోభ పెడుతూ ఓట్లు అడుక్కోవడం సిగ్గుమాలిన చర్య అని, ఎలక్షన్ కమీషన్ ను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులున్నారు.

గెలుపుపై ఎవరికి వారే ధీమా 

నిర్మల్/భైంసా/ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బైంసా నిర్మల్ ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 80 వార్డులకు 2004 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఊపందుకుంది.

అయితే పట్టణంలో పోలింగ్ కేంద్రాల వద్ద జనం లేకపోవడంతో ఓటర్లు ఇలా వచ్చి అలా ఓట్లు వేసి సంతోషం వ్యక్తం చేశారు. ఖానాపూర్ పట్టణంలో ఓ వార్డులో కొందరు ఓటర్లు రెండుసార్లు ఓట్లు వేశారని పోలీసులపై టిఆర్‌ఎస్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు 

ఎన్నికలకు ప్రతి ఒక్కరు సహకారం: కలెక్టర్ 

నిర్మల్ జిల్లాలోని బైంసా ఖానాపూర్ నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలు కల్పించడం పడిందని తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారని ఎందుకు రాజకీయ పార్టీలు కూడా సహకరించారని తెలిపారు.

నిర్మల్ బైసా మోడల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ సబ్ కలెక్టర్ సాయి సాకేత్ కుమార్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆర్డిఓ రత్న కళ్యాణి అధికారులు ఉన్నారు. 

బైంసా మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సబ్ కలెక్టర్ సాయి సంకేత్ కుమార్ అదనపు ఎస్పీ రాజేష్ మీనా సందర్శించారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు: ఎస్పీ

నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ బైంసా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గట్టి పోలీసు భద్రత మధ్య ప్రశాంతంగా ముసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మూడు మున్సిపాలిటీలో ఆమె సందర్శిం చి శాంతి భద్రతులపై ఎప్పటికప్పుడు పోలీసులకు సూచన లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పోలీస్ బృం దాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందర్నీ సమన్వయం చేసుకొని ఎన్నికల పోలింగ్ భద్రత పర్యవేక్షించడం జరిగిందన్నారు 

ఓట్లు వేసిన ప్రముఖులు 

నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ బైంసా మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. నిర్మల్ లో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీరరావు గ్రంథాలయ చైర్మన్ అరుచుమత్ అలీ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల అనురాధ అప్పల గణేష్ చక్రవర్తి బైంసాలో ఎంఐఎం అధ్యక్షులు జాబీర్ అహ్మద్ నిర్మల్ టిఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి మార్కొండ యోగితా రాము తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

గెలుపు ఓటములపై ధీమా..

నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అధికార పగ్గాలు చేజిక్కినందుకు చివరి వరకు ప్రయత్నాలు సాధించిన పార్టీలు ఎన్నికల పోలింగ్ సల్లులో గెలుపు ఓటములపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 స్థానాలు వస్తాయని విశ్వాసంతో ఉండగా బిజెపి 15 నుంచి 20 ఎంఐ ఎం 6 టిఆర్‌ఎస్ ఐదు వస్తాయని అంచనా వేస్తున్నారు ఖానాపూర్లో టిఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉందని రెండు పార్టీల నేతలు పేర్కొంటున్నారు.

బైంసాలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచన వేస్తుండగా భారత రాష్ట్ర సమితి తాము కీలకంగా మారబోతున్నట్లు విశ్వాసంతో ఉన్నారు. 

డీఈవో తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు తక్కువ రెమినేషన్ చెల్లించడం పై ఉద్యోగులు నిరసన తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో విధులు ముగించుకొని వచ్చిన ఉద్యోగులకు పిఓ, ఏపీవో కు చెల్లించవలసిన రీమినేషన్ కంటే తక్కువ చెల్లిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవోతో వాగ్వాదానికి దిగారు. డీఈఓ భోజన్న జోక్యం చేసుకొని నిబంధన ప్రకారం చెల్లిస్తున్నామని చెప్పిన వారు ఆయన ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతి ఎన్నికల్లో ఉన్నతాధికారులు రెమినేషన్ చెల్లింపులో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మణ్ శంకర్ అశోక్ తదితరులు ఆరోపించారు

ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రశాంతంగా..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ,బస్టాండ్ స్కూల్, గాంధీనగర్ ,వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అధికారులు వికలాంగులకు, వృద్ధులకు, వీల్ చైర్ అవకాశం కల్పించారు. పోలీసులు సిఐ అజయ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే ,డిసిసి అధ్యక్షులు వెడుమ బొజ్జు పటేల్, బిఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్లు సమీక్షించారు. 

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మల్, భైంసా, ఖానా పూర్ మున్సిపాలిటీల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుల్స్, అభ్యర్థుల గ్యాలరీలను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. 

ప్రశాంతంగా మున్సిపోల్స్

కుమ్రంభీం ఆసిఫాబాద్:  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా మొత్తం 13,927 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో 10,817 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 77.67 శాతం పోలింగ్ నమోదైంది.

కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 51,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 32,937 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 62.32 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ప్రారంభం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద నాయకుల హడావిడి..

పోలింగ్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకు లు ఆయా కేంద్రాల వద్ద సందడి చేశారు. ఓటర్లను తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు తదితరులు పోలింగ్ సరళిని పరిశీలించారు.

కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.పీ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై విశ్లేషణ చేపట్టారు.

జనకాపూర్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జనకాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రంలోకి గంటకు ఒకసారి పార్టీల వారీగా ఏజెంట్లను అనుమతించాలని పోలీసులు నిర్ణయించడంతో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు ఎక్కువగా అనుమతి ఇస్తూ,

తమకు అనుమతి నిరాకరిస్తున్నారని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్తో పాటు బీజేపీ నాయకులు డ్యూటీలో ఉన్న తిర్యాని ఎస్‌ఐ వెంకటేష్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అక్కడికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

మీడియాపై ఆంక్షలుపై అధికారుల జోక్యం..

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల అత్యుత్సాహం కనిపించింది. జిల్లా కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా గస్తీ కానిస్టేబుల్ నిరాకరించారు.

అనంతరం లింగాపూర్ ఎస్‌ఐ గంగన్న జోక్యం చేసుకుని అనుమతి కల్పించారు. జనకాపూర్ పోలింగ్ కేంద్రంలో కూడా గేటు వరకు మాత్రమే మీడియాకు అనుమతి ఇవ్వాలని జోనల్ అధికారి, ఆర్వో సూచించారని తిర్యాని ఎస్‌ఐ వెంకటేష్ అడ్డుకోవడంతో ఆర్డీవో లోకేశ్వరరావు ఫోన్ ద్వారా జోనల్ అధికారిని సంప్రదించి మీడియా ప్రతినిధులకు లోనికి అనుమతి కల్పించారు.