12-02-2026 01:43:11 AM
నది పరీవాహక అభివృద్ధికి గెజిట్ నోటిఫికేషన్
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కార్యరూపం దాల్చే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో మొదలు పెట్టేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోం ది. ఇందులో భాగంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో నది పరీవాహక ప్రాంతాల అభివృద్ధికి అధికారికంగా భూసేకరణ ప్రక్రి యకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ద్వారా తాజాగా ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
రంగారెడ్డి నుంచే భూసేకరణ..
మూసీ సుందరీకరణలో భాగంగా తొలి విడత భూసేకరణను రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లతో కూడిన సమగ్ర జాబితాను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నప్పటికీ, ఆపరేషన్ మొదట రంగారెడ్డి నుంచే మొదలవ్వడం గమనార్హం.
నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా..
భూములు కోల్పోతున్న రైతులు, యజమానులలో ఆందోళన కలగకుండా ప్రభు త్వం ముందుగానే భరోసా కల్పించింది. ప్ర స్తుత మార్కెట్ విలువ ఆధారంగానే బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ఎవరికీ అన్యా యం జరగకూడదన్న ఉద్దేశంతో పారదర్శకంగా వ్య వహరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అభ్యంతరాలకు ఆహ్వానం..
ప్రభుత్వం గుర్తించిన భూములకు సం బంధించి యజమానులకు ఏవైనా అభ్యంతరా లు ఉంటే తెలియజేయడానికి అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరా లను సమర్పించాలని సూచించారు. రైతులు లేదా భూయజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.