బాధిత కుటుంబానికి అండగా నిలబడతాం
తాడ్వాయి, మే, 18(విజయ క్రాంతి ): బాధిత కుటుంబానికి అండగా నిలబడుతుతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి సంజీవులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని సామదుబ్బ తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆదివారం రాత్రి చిరుత పులి దాడిలో తండా లోని రమేష్ కు మూడు లేగ దూడలు హతమయ్యాయని తెలిపారు.
బాదితకుటానికి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఈ విషయాన్ని తెలిపి ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు వెంకట్ రెడ్డి, మేకల రాజు, గంగారెడ్డి, సుధాకర్ రావు, ఉప సర్పం గణేష్ తదితరులు పాల్గొన్నారు.






