19 May, 2026 | 2:09 AM

ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

19-05-2026 12:56 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, మే 18 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి 108 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. ఇకనుంచి ప్రతి సోమవారం జిల్లాలోని డివిజన్ ప్రజలు ఆయా డివిజన్ కేంద్రంలో ప్రజావాణి ఫిర్యాదులను ఇవ్వవచ్చన్నారు. జిల్లా కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. ఈ సందర్బంగా స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత జిల్లా అధికారులకు ఇస్తూ తక్షణమే పరిష్కరించాలని  ఆదేశించారు.

చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, తమకు సమీపంలోని డివిజన్ కేంద్రానికే వెళ్లి దరఖాస్తులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.ప్రజలకు సౌకర్యవంతంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అధికారులు, ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, సీఈవో చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.