19 May, 2026 | 2:09 AM

‘సీబీఎస్‌ఈ’కే జై!

19-05-2026 12:53 AM
  1. ఈ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పిస్తున్న తల్లిదండ్రులు
  2. స్టేట్ బోర్డు స్కూళ్లపై తగ్గుతున్న ఆసక్తి
  3. జేఈఈ, నీట్ ఇతర పోటీపరీక్షల్లో రాణిస్తారనే భావన
  4. రాష్ట్రంలో ప్రతి ఏటా 40 నుంచి 60 కొత్త స్కూళ్లు

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): విద్యలో పోటీతత్వం పెరుగుతున్న క్రమంలో స్టేట్ బోర్డు స్కూళ్లపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆసక్తి తగ్గి సీబీఎస్‌ఈ స్కూళ్లపై పెరుగుతోం ది. ఆయా స్కూళ్లలోనే వారి పిల్లలను చేర్పించడం ప్రతిఏడాదీ పెరుగుతోంది. దీంతో ఆ స్కూళ్ల సంఖ్య కూడా రాష్ట్రంలో ప్రతి ఏటా అధికమవుతోంది. సీబీఎస్‌ఈ విధానంలో ప్రాక్టికల్ అప్రోచ్, కాన్సెప్ట్ ఓరియెంటేషన్, సి లబస్ స్టాండర్డ్ ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు సీబీఎస్‌ఈ స్కూళ్లనే ఎంచుకుంటున్నారు.

ఇప్పటి నుంచే ఈ పాఠశాలల్లో చదివిస్తే నీట్, జేఈఈ ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన, బాగా రాణిస్తారనే ఉద్దేశంతో ముందుచూపుతో అడుగులే స్తున్నారు. దీంతో సీబీఎస్‌ఈ స్కూళ్లు రాష్ట్రం లో ప్రతి ఏటా 40 నుంచి 60 కొత్తగా వెలుస్తున్నాయి. అంతేకాదండోయ్... స్టేట్‌సిలబస్ స్కూళ్లు కూడా సీబీఎస్‌ఈకి అపగ్రేడ్ అవుతున్నాయి. తెలంగాణలో పేరెంట్స్ ఎక్కువగా తమ పిల్లలను సీబీఎస్‌ఈ స్కూళ్లలోనే చదివించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

విద్య లో బాగా రాణించేందుకు సీబీఎస్‌ఈ స్కూళ్ల ను ఎంచుకుంటున్నారు. స్టేట్ సిలబస్‌లో చదివితే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో విద్యార్థులు రాణించడం కష్టమనే భావన తల్లిదండ్రుల్లో పాతుకుపోయిం ది. ఒకవేళ స్టేట్ సిలబస్‌ను ఎంచుకుంటే రాష్ట్రస్థాయిలో ని ఎప్‌సెట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకే పరిమితం కా వాల్సి ఉంటుంది. మళ్లీ టెన్త్ తర్వాత ఇంటర్‌లో ప్రత్యేకంగా జే ఈఈ, నీట్ వంటి కోర్సుల్లో చేర్పించాల్సి ఉంటుంది. పైగా సబ్జెక్టులు, లాంగ్వెజెస్‌పైన విద్యార్థులకు మంచి పట్టు వస్తుంది.

స్కూల్ స్థాయి నుంచే పిల్లలను సీబీఎస్‌ఈలో చేర్పి స్తే భవిష్యత్తులో పైచదువుల్లో ఇంకా బాగా రాణిస్తారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా సీబీఈఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య ప్రతి సంవత్స రం క్రమంగా పెరుగుతోంది. 2020లో మొత్తం 22,560 పాఠశాలలుంటే 2025 నా టికి వాటి సంఖ్య ఏకంగా దాదాపు 31,210కి చేరింది. అదే తెలంగాణ రాష్ట్రంలో 2016--2017 విద్యా సంవత్సరంలో మొత్తం 250 సీబీఎస్‌ఈ పాఠశాలలు మాత్రమే ఉండేవి. 2021-22లో సీబీఈఎస్‌ఈ స్కూళ్లు దాదా పు 353 ఉంటే 2022-23లో నాటికి 365 కు చేరాయి.

2023-24 నాటికి ఆ సంఖ్య కాస్త 415కు చేరింది. ఇక 2024-25లో 457, 2025--2026లో మొత్తం బడుల సంఖ్య ఏకంగా 650కి చేరుకున్నాయి. రా ష్ట్రంలో ప్రతి సంవత్సరం 40 నుంచి 60 కొ త్తగా వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 129, వరంగల్‌లో 52, రంగారెడ్డిలో 239, మహబూబ్‌నగర్, ఖమ్మంలో 26 చొప్పున, ఆదిలాబాద్‌లోనూ 13 స్కూళ్లు ఉన్నాయి.

వెనుకబడిన వనపర్తి, నిర్మ ల్ లాంటి జిల్లాల్లోనూ సీబీఎస్‌ఈ పాఠశాలలు వచ్చాయి. తొలుత ఈ స్కూళ్లు స్టేట్ బోర్డు నుంచి అనుమతి తీసుకుని తర్వాత సీబీఎస్‌ఈకు మా రుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా సీబీఎస్‌ఈకు యాజమాన్యాలు మా ర్చుకుంటు న్నాయి.

అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్

పేరున్న సీబీఎస్‌ఈ సిలబస్ ఉండే స్కూళ్ల లో అడ్మిషన్ దొరకాలంటే కష్టమే. ఫీజు ఎంతైనా ఇస్తామన్నా సీటు దొరకదు. ఇక అడ్మిషన్ల సమయంలో కాస్త ఆలస్యంగా వెళ్లి తే ఇక అంతే సంగతి. స్టేట్ బోర్డు స్కూళ్ల కంటే ముందే వీటిలో అడ్మిషన్లు, తరగతులు ప్రారంభమవుతాయి. పరీక్షలు కూడా అంతే. అందుకే ఈ స్కూళ్లలో చదువుతే జేఈఈ, నీట్‌లో సీటు పక్క అనే భావన తల్లిదండ్రు ల్లో నాటుకుపోతోంది. పైగా జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షలను ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలపైనే ఆధారపడి నిర్వహిస్తున్నారు.

అందుకే ఇందులో చదివే విద్యార్థులకు ఇది కలిసొచ్చే అంశం. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఇందులో ప్రాధాన్యం ఇస్తారు. ఈ స్కూళ్లలో చదివిస్తే హిందీ, ఇంగ్లిష్ భాషలే కాకుండా స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషలను నేర్పిస్తారు. భవిష్యత్‌లో విదేశాలకు వెళ్లే వారికి అక్కడ ఇబ్బంది ఉండదు. ఎప్పుడూ చదువే అని కాకుండా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఉంటాయి. తరగతులు ఇరుకు గదుల్లో కాకుండా విశాలమైన గదులు, డిజిటల్ బోర్డుల్లో విద్యను బోధిస్తారు.

నగరాల్లో ఉండే స్కూలు కనీసం ఒక ఎకరా భూమిలో, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రెండెకరాల విశాల స్థలంలో ఉంటాయి. ఈ తరహా అంశాలు పిల్లల తల్లిదండ్రులను ఆకర్షిస్తుండటంతో వారిని అందులోనే చేర్పిస్తున్నారు. అందుకే   ఫీజు ఎక్కువగా ఉన్నా అన్ని వర్గాల వారు సైతం సీబీఎస్‌ఈల్లోనే చదివిస్తున్నారు. సీబీఎస్‌ఈ యే కాకుండా ఐసీఎస్‌ఈ, కేంబ్రిడ్జి తదితర బోర్డుల్లోనూ చదివించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.