29 July, 2026 | 2:33 AM

ఎన్డీఏ మంగళ్ మిలన్

29-07-2026 01:42 AM
  1. ప్రధాని మోదీ సమక్షంలో పార్లమెంటరీ భేటీ
  2. పలువురు కేంద్రమంత్రులు, ఎన్సీపీఐ ఎంపీలు హాజరు

న్యూఢిల్లీ, జూలై28: పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగించా రు.

భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎన్టీఏ) విజయం, వ్యూహాత్మక ప్రభావం గురించి పీయూష్ గోయల్ వివరించారు. మత్స్య రంగ వృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ ప్రస్తావించారు.

పార్లమెం ట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ భేటీకి, తొలిసారిగా కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్సీపీఐ)కు కూడా ఆహ్వానం లభించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ఎన్సీపీఐలో చేరిన సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితర 20 ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.