పీఆర్సీ అమలు చేయకపోతే ఉద్యమిస్తాం
కూసుమంచి, జులై 14(విజయక్రాంతి):తెలంగాణ రెండవ పిఆర్సి తక్షణ అమలు కోసం ఉద్యమిస్తామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వం క్యాంపైన్ నిర్వహించి , ఆయా పాఠశాలల వద్ద జిల్లా కార్యదర్శి మండవ నర్సయ్యతో కలిసి ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఉద్యోగులు,
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తుందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా పిఆర్సీ ఇవ్వటంలో, డిఎలు మంజూరు చేయడంలో, నూతన పెన్షన్ విధానం రద్దు చేయడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఈ క్యాంపైన్ లో టీఎస్ యుటిఎఫ్ నాయకులు శ్రీనివాసరావు, రాజు, వీరబాబు, జుబేదాబేగం, యాదగిరి, చారి, పాషా తదితరులు పాల్గొన్నారు.






