15 July, 2026 | 12:50 AM

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పోచయ్యకు చోటు

15-07-2026 12:50 AM

కుంగ్ ఫూ గ్రాండ్ మాస్టర్‌ను అభినందించిన జగ్గారెడ్డి

భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచన 

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కుంగ్ ఫూ గ్రాండ్ మాస్టర్ పోచయ్యను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. మంగళవారం సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పోచయ్య కలిసి తాము నెలకొల్పిన రికార్డు గురించి ఆయనకు వివరించారు.

ఈ విషయమై సంతోషం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి, పోచయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు. ఏప్రిల్ 26న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రదర్శనకు సంబంధించి మూడు రోజుల క్రితం అధికారికంగా రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికెట్లను లండన్ నుంచి పంపించారు. ఈ ప్రదర్శనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన కుంగ్ ఫు మాస్టర్ పోచయ్యతో పాటు అతని శిష్య బృంద సభ్యులు పాల్గొన్నారు. కుంగ్ ఫూ క్రీడకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిసారిగా పోచయ్య బృందం ఈ అరుదైన ఘనతను సాధించించడం అభినందనీయమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.