భూసేకరణ సర్వే పనులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ అంకిత్
చండ్రుగొండ, జులై 14( విజయ క్రాంతి ): చండ్రుగొండ మండలంలో సీతరామ ప్రాజెక్టు పంటకాలువల కోసం భూసేకరణ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సర్వే బృందాన్ని ఆదేశించాడు. మంగళవారం చండ్రుగొండ మండలంలో తిప్పనపల్లి రెవెన్యూ పరిధిలో సీతరామ ప్రాజెక్టు పంటకాలువల కోసం భూసేకరణ సర్వే పనులను ఆయన అకస్మికంగా తనిఖీ చేశాడు. సర్వే వివరాలను అడిగి తెలుసుకొని పనులను స్పీడ్ పెంచాలన్నారు.
దామరచర్లలో సర్ ప్రోగ్రాంను తనిఖీ చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశాడు. చండ్రుగొండ జిలా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకాన్ని పరిశీలించి, క్వాలిటిని మెయింటెన్ చేయాలన్నారు. విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వహకులకు సూచించాడు. ఆయన వెంట ఆర్డిఓ మధు, తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఎంపిడిఓ అశోక్, ఆర్‌ఐ తిరుమలరావు, తదతరులు పాల్గొన్నారు.






