19 March, 2026 | 7:56 AM

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమం చేస్తాం

19-03-2026 01:23 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు

కామారెడ్డి, మార్చి 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమం చేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అన్నారు. బుధవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో మంజూరు చేయడం లేదని దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల యజమానులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

స్కాలర్షిప్లు ఫీజు నెంబర్ సిమెంట్ విద్యార్థులకు సకాలంలో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. అర్హులైన వృద్ధులు వికలాంగులకు వితంతువులకు పింఛన్లు చెల్లించాలని అన్నారు.

ల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని రైతు భరోసా సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలన్నారు. బిజెపి ఆధ్వర్యంలో గత సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలను అందజేయడం జరిగిందన్నారు.  23న రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులు అసెంబ్లీ ముట్టడి చేస్తామని పేర్కొన్నారు.   ఈ సమావేశంలో బిజెపి నాయకులు బిజెపి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కౌన్సిలర్ కుంట లక్ష్మారెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు విపుల్ జైన్, బాల్ కిషన్ పాల్గొన్నారు.