28 June, 2026 | 2:36 AM

తెలంగాణలో బీజేపీ విజయపతాకం ఎగురవేస్తాం

28-06-2026 12:57 AM
  1. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
  2. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

ఘట్ కేసర్, జూన్ 27 (విజయక్రాంతి) : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజ య పతాకం ఎగురవేయడం ఖాయమని మ ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలో ని అవుషాపూర్‌లోని రాక్ ఎన్క్లేవ్ కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అ ధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న ముఖ్య సమావేశానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఏర్పాట్లను ఎంపీ ఈటల రాజేందర్ శనివారం బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజక వర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి లతో కలిసి పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈ టల రాజేందర్  మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ శక్తి రోజురోజుకూ బలోపేతం అవుతోందని, రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా చూస్తున్నారని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, యువత, మహిళ లు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని, అదే స్ఫూర్తితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు రావడం రాష్ట్ర బీజేపీకి మరింత ఉత్సాహాన్ని తీసుకువస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనివాస్ పాల్గొన్నారు.