calender_icon.png 19 February, 2026 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను రాజ్యాంగ బద్ధంగా ఓడిస్తాం

17-02-2026 12:32:35 AM

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ 

ముషీరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాం తి): ఇటీవల తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అలియాబాద్, మెదక్ మున్సిపాలిటీలలో రాజ్యాంగబద్ధంగా గెలిచిన బీఎస్పీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమ పద్ధతిలో కౌంటింగ్ సెంటర్ నుంచి కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలో రాజ్యాంగ బద్ధంగా రాజకీయంగా బొంద పెడతామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ మండిపడ్డారు.

సోమవారం బీఎ స్పీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పి కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతల కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దేశంలో మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా ఉండడానికి జాతీయస్థాయిలో కాం గ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంటే తెలంగాణలో మాత్రం బీఎస్పీ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేసి నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉండకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని విప్ ని గౌరవించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బీఎస్పి తెలంగాణ, ఏపీ కో ఆర్డినేటర్ ఎం. బాలయ్య, తెలంగాణ కో ఆర్డినేటర్లు దాగిల్ల దయానందరావు, 

అడ్వకేట్ నిమిషాని రామచంద్రం, బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బి. ఈశ్వర్ మంచాల శ్రీకాంత్, ప్రభు కుమార్, రాష్ట్ర కార్యదర్శులు అనిత రెడ్డి, లింగంపల్లి యాదగిరి, కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్, రాజు, ఎనగందుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.