10 July, 2026 | 10:28 PM

ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

10-07-2026 09:33 PM

ఖమ్మం టౌన్, (విజయక్రాంతి): స్థానిక నెహ్రూ నగర్ ప్రాంతంలో పాత భద్రాద్రి బ్యాక్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను శుక్రవారం భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకురి క్రిష్ణ మూర్తి ప్రారంభించారు. ఈ హాస్పత్రిలో జనరల్ వైద్య సేవలతో పాటు న్యూరో సైకియాట్రీ, డెర్మటాలజీ, ఈఎన్ టీ, డెంటల్, ఓఎంఎఫ్ఎస్, క్రిటికల్ కేర్, వంటి ప్రత్యేక సదుపాయాలతో 24 గంటల పాటు సేవలందించడానికి ఆస్పత్రిని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. జనరల్ వార్డు, స్పెషల్ రూమ్స్, ఐసీయూ, ల్యాబ్ తో పాటు అంబులెన్స్ సర్వ సన్నదంగా వ్యాదిగ్రస్తులకు సత్వరం వైద్య సేవలకు సిద్ధంగా ఉంచామని ఆస్పత్రి యాజమాన్యం పిట్టల శ్రీకాంత్ రాజ తెలిపారు.

ప్రమీల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవ డాక్టర్ కన్నెగంటి శివరామక్రిష్ణ (ఎండీ జనరల్ మెడిసిన్), డాక్టర్ మోపర్తి సురేష్ బాబు (ఎండీ పీడియార్టీక్), డాక్టర్ పరుచురి వెంకటేశ్వర రావు (ఎండీఎస్), డాక్టర్ జంగాల సునిల్ కుమార్ (డీఎం గ్యాస్ట్రో), డాక్టర్ కె.స్వర్ణ కుమారి (డీజీఓ), డాక్టర్ భరత్ బాబు (ఎండీ జనరల్ మెడిసిన్), డాక్టర్ కె. రవికుమార్ ,డాక్టర్ రమేష్ రెడ్డి ఆలంపాటి(ఎండి జనరల్ మెడిసిన్), డాక్టర్ వరుణ్ జొన్నలగడ్డ (ఎంఎస్ న్యూరో సర్జన్) లతోపాటు పలువురు జూనియర్ డాక్టర్లు వివిధ ఆస్పత్రుల యాజమాన్యాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు ఆస్పత్రి మెనేజ్ మెంట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. మంచిగా వైద్య సేవలను అందించి, ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ అభిలాష్ రెడ్డి, కీర్తి ప్రవళికాను శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వాతీ ఆస్పత్రి మేనేజ్ మెంట్ లక్ష్మణ్ రావు, స్పర్శ ఆస్పత్రి మేనేజ్ మెంట్ భాస్కర్ రెడ్డి, శశి ఆస్పత్రి మేనేజ్ మెంట్ శ్రీను, క్యూర్ ఆస్పత్రి మేనేజ్ మెంట్ వాసు, నందన ఆస్పత్రి మేనేజ్ మెంట్ పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస ఆస్పత్రి మేనేజ్ మెంట్ వెంకన్న, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వెంకటా చారీ, ఉపాధ్యక్షుడు వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు.