calender_icon.png 19 February, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి పారవశ్యంతో కలెక్టర్ శివతాండవ స్తోత్రం.. మంత్రముగ్ధులైన భక్తులు

17-02-2026 12:31:25 AM

వేములవాడ, ఫిబ్రవరి 16,(విజయక్రాంతి): మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో భక్తి వాతావరణం నెలకొంది. జాతర వేడుకలలో భాగంగా శివార్చన స్టేజ్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకం గా నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని శివ తాండవ స్తోత్రాన్ని ఆలపించా రు.ఆమె గాత్రంతో వినిపించిన శివ తాండవ స్తోత్రం అక్కడికి విచ్చేసిన భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని మరింతగా పెంపొందించింది.

శ్లోకాల ఉచ్చారణ, స్వర మాధుర్యం సభికులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమ ప్రాం గణం మొత్తం కొంతసేపు భక్తి రసంలో మునిగిపోయింది.జాతర సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచడమే కాకుం డా సంప్రదాయ భక్తి సాంప్రదాయాల ప్రా ముఖ్యతను చాటాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఆలయ నిర్వాహకు లు, భక్తులు పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా శివ స్తోత్రం ఆలపించడం జాతర వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.