11 July, 2026 | 1:01 AM

సింగరేణిలో 5 గనులకు 5 స్టార్ రేటింగ్

11-07-2026 12:00 AM
  1.  7 విభాగాల్లో 50 అంశాలలో పరిశీలించి రేటింగ్...- 
  2. మంచిర్యాల జిల్లా నుంచి 3 గనులు ఎంపిక...- 
  3. ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల నుంచి ఒక్కో గని..

మంచిర్యాల, జూలై 10 (విజయక్రాంతి) : కేంద్ర బొగ్గు శాఖ ప్రతీ ఏటా నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో ఈ సారి సింగరేణి సంస్థ నుంచి 5 గనులు 5 స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుల కు ఎంపికయ్యాయి.

కేంద్ర బొగ్గు శాఖ విడుదల చేసిన జాబితాలో మంచిర్యాల జిల్లాలో నీ శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్ కె న్యూటెక్, ఆర్ కె 6 గనులు, బెల్లంపల్లి ఏరి యా నుంచి ఖైరిగూడ ఓపెన్ కాస్టు గనితో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా నుంచి జెవిఆర్ ఓసి 2, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం-3 ఏరియా నుంచి ఆర్ జి ఓసి 1 గనులు అత్యుత్తమ 5 స్టార్ రేటింగ్ గనులుగా ఎంపికైనట్లు ప్రటించారు.

దేశవ్యాప్తం గా 382 గనులు దరఖాస్తు చేసుకోగా 50 గనులు ఎంపికయ్యాయి. వీటిలో 5 సింగరే ణి నుంచి ఉండటం విశే షం. గత ఏడాది 4 గనులకు 5 స్టార్ రే టింగ్ రాగా 2024--25కు గాను అత్యధికంగా 5 గనులకు రే టింగ్ లభించింది. దీనిపై ఇంధన శాఖ మం త్రి భట్టి విక్రమార్క అధికారులు, కా ర్మికులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

7 విభాగాల్లో.. 50 అంశాల్లో పరిశీలించి..

బొగ్గు గనుల్లో ఉత్తమ పని విధానం, కార్మిక సంక్షేమం, పర్యావరణహిత చర్యలు, సమీప గ్రామాల అభివృద్ది వంటి 7 ప్రధాన విభాగాల్లో మొత్తం 50 అంశాలలో అత్యుత్తమంగా ఉంటున్న గనులను ప్రోత్సహించాల నే ఉద్దేశంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ  శాఖ తన అనుబంధ సంస్థ అయిన కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతీ ఏడాది ఈ పోటీని నిర్వహిస్తున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ప్రతీ ఏటా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల నుంచి 5 స్టార్ రేటింగ్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు మైనింగ్ కంపెనీలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తుంది.

ఇందులో ప్రధానంగా 7 విభాగాల్లో (గనుల ప్రతిభ, పని పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని ఆ గనుల్లో మైనింగ్ ఎలా నిర్వహిస్తా రు? బొగ్గు తవ్వకం టెక్నాలజీని సమర్ధవంతంగా వాడుతున్నారా? గని ఆర్థిక పరిస్థితు లు ఎలా ఉన్నాయి? గని ప్రభావిత ప్రాంతాలలో, రక్షణ, కార్మికుల భద్రతకు తీసుకొం టున్న చర్యలు, పర్యావరణహిత చర్యలు) పరిశీలనకు తీసుకొని 50 అంశాలలో ఏ గనులు  అయితే నూటికి 90 శాతం మార్కు ల పైబడి సాధిస్తాయో వాటిని 5 స్టార్ (అత్యుత్తమ) గనులుగా గుర్తిస్తారు. 

సింగరేణి పనితీరుకు నిదర్శనం ఈ అవార్డులు

సింగరేణి సంస్థ పనితీరు, రక్షణ, భద్రత, పర్యావరణహిత చర్యల అమలుకు గుర్తింపుగా సింగరేణికి ఈ అవార్డులు  లభించా యి. 5 స్టార్ రేటింగ్ సింగరేణి వ్యాప్తంగా ఐ దు గనులు ఎంపిక కాగా మంచిర్యాల జిల్లాలోనీ మూడు గనులు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. 5-స్టార్ కన్నా  కొంచెం త క్కువ మార్కులు (80-90 శాతం) సాధించిన గనులను 4 స్టార్ రేటింగ్ గనులు అంటారు. 4 స్టార్ రేటింగ్ లో సింగరేణి వ్యాప్తంగా మ రో 17 గనులు ఎంపిక అయ్యాయి.

ఈ గనులకు ? ఎలాంటి అవార్డులు ఇవ్వరు కానీ దాదాపు ఉత్తమ శ్రేణి వరకు వచ్చిన గనులుగా గుర్తింపు వస్తుంది. రానున్న రోజుల్లో క్రమ శిక్షణ, రక్షణ, సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణహిత చర్యలను సమర్థంగా అమ లు జరుపుతూ అధికారులు, కార్మికుల సహకారంతో మరిన్ని గనులు అత్యుత్తమ పని తీరుతో 5 స్టార్ రేటింగ్ వచ్చేందుకు కృషి చేస్తాం.

 మునిగంటి శ్రీనివాస్,

జీఎం శ్రీరాంపూర్ ఏరియా,

మంచిర్యాల