11 July, 2026 | 1:36 AM

తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఘనంగా జన్మదిన వేడుకలు

11-07-2026 12:35 AM

నాగోల్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహరి గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగోల్ సాయి కాలనీ లో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్ కలిసి శ్రీహరి గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీహరి గౌడ్ బీసీల రాజకీయ, సామాజిక సాధికారత కోసం చేస్తున్న కృషిని వారు అభినందించారు. భవిష్యత్తులో కూడా బీసీల హక్కుల సాధన కోసం ఆయన మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.