10 July, 2026 | 11:03 PM

లింగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

10-07-2026 09:46 PM

కాంట్రాక్టర్, ఆర్,బి అధికారుల నిర్లక్ష్యమే 

గ్రామ సర్పంచ్ రామనోళ్ల బాలస్వామి

జడ్చర్ల : మండలంలోబాలానగర్–గంగాపూర్ ప్రధాన రహదారి నిర్మాణ పనులను నిర్వహిస్తున్న CIVET కంపెనీ కాంట్రాక్టర్ సంబంధిత ఆర్&ల,బి అధికారుల నిర్లక్ష్యం కారణంగా లింగంపేట గ్రామంలో శుక్రవారం అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రోడ్డు పనులు ప్రారంభమైనప్పటి నుంచి రోడ్డుపై కంకర, దుమ్ము పేరుకుపోవడం, రహదారిని సురక్షితంగా ఉంచకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ రామనోళ్ల బాలస్వామి అంటున్నారు.

ఈ విషయంపై సంబంధిత ఏఇ ,ఇఇ , డిఇ,అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో, రోడ్డుపై ఉన్న కంకర కారణంగా కారు బ్రేకులు సరిగా పనిచేయక ఒక చిన్న పాపను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాప తలకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డు పనుల్లో జరిగిన నిర్లక్ష్యమేనని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ అధికారులు స్పందించకపోవడం అత్యంత బాధాకరం.

ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన CIVET కంపెనీ కాంట్రాక్టర్ మరియు సంబంధిత ఆర్&బి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే రహదారి పనులను అత్యవసరంగా పూర్తి చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని లింగంపేట గ్రామ సర్పంచ్ రామనోళ్ల బాలస్వామి డిమాండ్ చేశారు.ఇకపై ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.