నేడే యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం
10 నుండి 1 వరకు తాత్కాలికంగా దర్శనాల నిలుపుదల
దేవస్థానం ఈవో భవాని శంకర్
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు ప్రభుత్వం నియమించిన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఉదయం 11:37 నిమిషాలకు నిర్వహించనున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన సమయాలను మార్పు చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. సుదర్శన నరసింహ హోమం 8 నుండి 10 వరకు, బ్రేక్ దర్శనం 9 నుండి 9:30 వరకు,నిత్య కళ్యాణం 10: 30 నుండి 1గంట వరకు తాత్కాలికంగా మార్పులు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఎలాంటి ప్రైవేటు వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు. నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.






