జామ మసీదు అధ్యక్షులుగా సయ్యద్ రిజ్వాన్ ఏకగ్రీవ ఎన్నిక
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల తంజీముల్ మసాజిద్, జామ మసీదు అధ్యక్షులుగా సయ్యద్ రిజ్వాన్ ను శుక్రవారం ఎన్నికల నియామక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో రిజ్వాన్ ను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇంతియాజ్ తన్ను నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. తన్ను పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని ముస్లిం మత పెద్దలు నియామక ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జామ మసీదులో సయ్యద్ రిజ్వాన్ ను ఘనంగా సన్మానించారు.
అధ్యక్షుడికి మూడేళ్ల పదవీ కాలం ఉంటుంది. పట్టణంలోని అన్ని మసీదులను తంజీముల్ మసాజిద్ ద్వారా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా రిజ్వాన్ మాట్లాడుతూ మస్జీద్ నిర్వహణ, మత సామరస్యం, మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షులుగా నియమించినందుకు ముస్లిం మత పెద్దలకు, అన్ని మసీదుల కమిటీలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శుక్రవారం ప్రార్థనల అనంతరం వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో, జిల్లాలో, బాన్సువాడలో వర్షాలు పడాలని, రైతుల పంటలు సస్యశ్యామలంగా మారాలని, జంతువులకు నీరు లభించాలని అల్లాహ్ ను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు హఫెజ్ వహాబ్, సైద్ ఖాన్, లాయక్,షేక్ అజీమ్, అతిఫ్, అఫ్రోజ్, అసద్ బిన్ మోసిన్, ఖయ్యుమ్ నిశాత్, అబ్దుల్ ఖలీక్, అహ్మద్, సమివుద్దిన్, షేక్ అక్బర్, మీరా నసీముద్దీన్, నసీమ్, ఫస్సి, నజీబ్, కాజీమ్ బాగవాన్, యూసుఫ్, బారి చావుస్, జబ్బార్, ఇస్మాయిల్, శుకూర్, మౌలానా మత గురువులు మౌలానా రఖీబ్, ముఫ్తి ఉమర్ బిన్ ఈసా, హాఫిజ్ ఫహీమ్, ఏజాస్ మౌలానా, మౌలానా మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.






