calender_icon.png 19 February, 2026 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి, కరీంనగర్ కోర్టులను పేల్చేస్తాం

19-02-2026 02:52:37 AM

  1.   12 చోట్ల ఆర్డీఎక్స్ .. ఆగంతకుల ఈ-మెయిల్
  2. బయటకు పరుగులు తీసిన జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది 
  3. బెదిరింపుల వెనుక తమిళనాడు లింక్ 
  4. సంచలనం రేపుతున్న ఈ-మెయిల్ అంశాలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు బుధవారం బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డాయి. అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు తో పాటు కరీంనగర్ జిల్లా కోర్టు, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి జిల్లా కోర్టులను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తు ల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ పెను కలకలం రేపాయి.

కోర్టు ఆవరణలో 12 చోట్ల శక్తివంతమైన ఆర్డీఎక్స్ బాంబులను అమర్చామని, అవి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలుతాయని వచ్చిన హెచ్చరికతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా హైఅలర్ట్ అ య్యింది. బుధవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ఊపందుకుంటున్న సమయం లో ఈ బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం తెలియగానే నాంపల్లి, కరీంనగర్ కోర్టుల్లో ఉన్న జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ప్రాణభయంతో ఆవరణల నుంచి బయటకు పరుగులు తీశారు.

తక్షణమే స్పందించిన పోలీసులు కోర్టు భవ నా లను ఖాళీ చేయించి, పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి కోర్టుల వద్ద బాంబ్ స్క్వా డ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కోర్టు కార్యాలయాలు, జడ్జిల ఛాంబర్లు, పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణం గా గాలించిన తర్వాత అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని, ఇవన్నీ హోక్స్ మెయిల్స్ అని పోలీసులు తేల్చారు.

అయితే, నిజంగానే ఇవి తమిళనాడు పోలీసుల ఆవేదనతో పంపినవేనా లేక పోలీసుల పేరును వాడుకుంటూ ఎవరైనా కావాలనే ఈ కుట్ర పన్నారా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల పోలీసులు ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీసులతో సమన్వ యం చేసుకుంటూ నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ-మెయిల్స్ వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.  

ఉంపుడుగత్తెల బట్టలు ఉతికిస్తున్నారు.. 

తమిళనాడు పోలీసు సిబ్బంది పేరుతో వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌లో ఉన్న ఆరోపణలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. తమి ళనాడులో కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయి. మా చేత ఒక సినీ నటి, డీఎంకే నేతల ఉంపుడుగత్తెల బట్టలు, వారి ఇళ్లలోని మురికి పాత్రలను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారు అని అగంతకులు ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, తమ డిమాండ్లు వినిపించేందుకు మరో మార్గం లేకనే బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. 

శ్రీలంక తరహా ఆత్మాహుతి దాడులు చేస్తాం

మెయిల్లో కేవలం పేలుళ్ల గురించే కాకుండా, పక్కా ఆపరేషన్ తరహా హెచ్చరికలు జారీ చేశారు. సీ-4 ఆర్డీఎక్స్తో తయా రు చేసిన మూడు ఐఈడీలను ఇప్పటికే న్యాయమూర్తుల ప్రాంగణాల్లోని కీలక ప్రాంతాల్లో అమర్చాం. మధ్యాహ్నం క్యూబ్రాంచ్-ఐఎస్‌ఐ సభ్యులు రిమోట్ కంట్రోల్ ట్రిగ్గర్లతో 100 అడుగుల లోపలికి రాగానే ఇవి పేలిపోతాయని హెచ్చ రించారు.

ఒకవేళ ఏదైనా కారణం చేత అవి పేలకపోతే, తమ సభ్యులే లోపలికి వచ్చి శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్ తరహాలో తమను తాము పేల్చుకుంటామని ఆత్మాహుతి దాడులు పేర్కొనడం తీవ్ర కల కలం రేపింది. ఈ మెయిల్ నాగపట్టణం మాజీ క్యూబ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్, సున్నియా దాస్ ప్రసాద్ పేర్లతో పోలీసులకు అందింది.