3 April, 2026 | 1:50 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

06-10-2025 12:00 AM

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల అక్టోబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్  లో  మల్డకల్  మండలంలోని  నాయకులు కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుందని  గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి పిలుపునిచ్చారు.

నా ఎమ్మెల్యే ఎన్నికలలో నా గెలుపు కోసం కృషిచేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి ఎంపీటీసీ ,జడ్పిటిసి, సర్పంచుల అభ్యర్థులను గెలిపించి భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాదే అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి , జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ   ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,  నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.