ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించండి
06-10-2025 12:00 AM
రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
హన్వాడ, అక్టోబర్ 5: భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.ఆదివారం నవాబ్ పేట్, కోయిల్ కొండ హన్వాడ, మహబూబ్ నగర్ అర్బన్ మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. మండల తహశీల్దార్,రెవెన్యూ సిబ్బందితో భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పై,ఎలక్షన్ క్లెయిమ్స్ క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.




