నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలి
డీఈవో రమేష్ కుమార్
కల్వకుర్తి జులై 29 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాన్యమై న విద్యను అందించడమే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పని చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. బుధవారం ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఉపాధ్యాయులకు కల్వకుర్తిలో జరుగుతున్న ప్రత్యేక శిక్షణా తరగతులను పరిశీలించి మాట్లాడా రు. విద్యార్థుల్లో చిన్న వయస్సులోనే మంచి అభ్యాస అలవాట్లు పెంపొందితే వారి భవిష్యత్ విద్యాభ్యాసం మరింత సులభంగా సా గుతుందన్నారు.
ముఖ్యంగా చదవడం, రా యడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చోట వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించాలని సూచించారు. ప్రతి తరగతి గదిని విద్యార్థులు ఆనందంగా నేర్చుకునే అభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దాలని డీఈఓ తెలిపారు.
కేవలం ఉపన్యాస పద్ధతిలో కాకుండా కార్యకలాపాల ఆధారిత బోధన, కథలు, పాటలు, ఆటలు, చిత్రాలు, బొమ్మలు, బోధనా-అభ్యాస సామగ్రి (టీ.ఎల్.ఎం.) వినియోగం ద్వారా బోధనను ఆసక్తికరంగా మార్చాలని సూచించారు. విద్యార్థులు స్వయంగా పాల్గొని నేర్చుకునే అవకాశాలు కల్పిస్తే అభ్యాస ఫలితాలు మరింత మెరుగుపడతాయని వివరించారు. విద్యార్థుల అభ్యాసంలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని తెలిపారు.






