27 June, 2026 | 6:49 PM

సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అండగా ఉంటున్నాం

27-06-2026 05:26 PM

- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని కే ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో దండేపల్లి, లక్షెట్టిపేట్ మండల, మున్సిపాలిటీకి చెందిన 117 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ  ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మన మంచిర్యాల నియోజక వర్గంలో 2,911 ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని వివరించారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రోగులు వెళ్లకుండా మన మంచిర్యాలలోనే సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రభుత్వం విద్య, వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని వెల్లడించారు. ఆపదలో వున్నవారికి ఎలాంటి జాప్యం జరుగకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా వెంటనే చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏ కష్టం వచ్చిన తనను సంప్రదించాలన్నారు. అనంతరం లబ్దిదారులకు రూ. 46,07,600 విలువైన చెక్కులను అందజేశారు.