27 June, 2026 | 8:00 PM

పల్స్ పోలియోను విజయవంతం చేయండి

27-06-2026 06:49 PM

మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో  5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా వ్యవహరించి, సమీప పోలియో బూత్‌కు తమ చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. "రెండు చుక్కలు  ప్రతి చిన్నారికి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు అంతటి పుష్పలత పిలుపు నిచ్చారు.