8 March, 2026 | 3:08 AM

హోర్ముజ్ వద్ద మేం సిద్ధం

08-03-2026 01:19 AM

అమెరికా దళాల కోసం ఎదురు చూస్తున్నాం

1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్‌ను గుర్తుచేసుకోవాలి 

ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీమహ్మద్ నైని

టెహ్రాన్, మార్చి 7 : ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద ‘అమెరికా(యూఎస్) దళాలను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం’ అని శనివారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. అగ్రరాజ్యం ఏదైనానిర్ణయం తీసుకునే ముందు 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్ ప్రమాదాన్ని గుర్తుచేసుకోవాలని ఆయ న సూచించారు. జలసంధి మీదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటించారు. దీనికి స్పందిస్తూ  ఐఆర్‌జీసీ ఈ హెచ్చరికలు చేసింది. 

ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని మీడియాతో మాట్లాడుతూ.. అగ్రరాజ్యం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1987 లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్‌కు జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకోవాలని అన్నా రు. దీంతో పాటు ఇటీవల ఆ దేశ చమురు ట్యాంకర్లను కూడా తాము టార్గెట్ చేసుకున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

1987 లో కువైట్‌కు చెందిన బ్రిడ్జ్‌టన్ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తుండగా నాటి ఉద్రిక్తతల దృష్ట్యా యూఎస్ నౌకాదళం ఆ నౌకకు రక్షణ కల్పించింది. అయితే ఆనాడు ఆ నౌకను ఐఆర్‌జీసీ లక్ష్యంగా చేసుకుంది. ఫార్సీదీవుల సమీపంలో నౌక వెళ్లే దారిలో నీటి అడుగున పేలుడు పదార్థాలను ఉచంఇ దాడి చేసింది. ఈ ప్రమాదంలో నౌక ధ్వంసమైనప్పటికీ తన ప్రయాణాన్ని సాగించి గమ్యస్థానాన్ని చేరింది.