2 May, 2026 | 2:45 PM

నీరు వృథా.. అరికట్టకపోతే వ్యధ

02-05-2026 01:39 PM

లీకేజీ తో వృధా పోతున నీరు 

వాంకిడి, (విజయక్రాంతి): ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా 15 రోజుల తరబడి పైప్ లైన్ లీకేజీ ఐ నీరు వృథాగ పోతుంది. పైప్ లైన్ లీకై నీరు పారి నీటితో పెద్ద గొయ్యి ఏర్పడి కుంటను తలపిస్తుంది. అయినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వాంకిడి మండలం పరిధి లంజన్ వీర గ్రామానికి వెళ్లే రహదారి పక్కన భగీరథ పైప్లైన్ మరమ్మతు గురైంది. క్రమంగా నీరు వృధా అవుతుంది. దీనిని గమనించిన వాహనదారులు, స్థానికులు మాట్లాడుతూ... అసలే వేసవికాలం.. తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీరు ఇలా వృధా అవుతుందని వారు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.