266 సరిపోలేదు
- టీ20 క్రికెట్‌లో అద్భుతం
- పొట్టిఫార్మాట్‌లో రికార్డు ఛేదన
ఓక్లాండ్, జూలై 16 : టీ20 ఫార్మాట్‌లో ఎంత పెద్ద స్కోరైనా సురక్షితం కాదని మరోసారి తేలిపోయింది. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ లో 267 పరుగుల భారీ టార్గెట్‌ను వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు అలవోకగా ఛేదించింది. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ20 లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. 51 సిక్సర్లు, 3 సెంచరీలు ఒకే మ్యాచ్‌లో నమోదవడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ న్యూ యార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 266 పరుగులు చేసింది.
కెప్టెన్ నికోలస్ పూరన్ సెంచరీతో చెలరేగాడు. పూరన్ కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 13 సిక్సర్లతో 106 పరుగులు చేశా డు. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లు పడగొట్టాడు. తర్వా త ఛేజింగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ దుమ్మురేపింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆండ్రిస్ గోస్ మె రుపు సెంచరీలతో భారీ టార్గెట్‌ను కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించింది.
టీ20 చరిత్రలోనే ఇది అత్యధిక పరుగుల ఛేజింగ్. ఆండ్రి స్ గోస్ 51 బంతుల్లో 132(10 ఫోర్లు, 12 సిక్సర్లు), స్మిత్ 48 బం తుల్లో 110 (7 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 51 సిక్సర్లు న మోదయ్యాయి. ఈ విజయంతో వాషింగ్టన్ ముందంజ వేయ గా, ఎంఐ న్యూ యార్క్ టోర్నీనుంచి నిష్క్రమించింది.






