ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి
ఖానాపూర్,(విజయక్రాంతి): బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ 2027కు పోటీపడుతున్న అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇవ్వన్నటు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. సివిల్ సర్వీస్ పోటీపరీక్షలకు హాజరయ్య గారికి లాంగ్ టర్మ్ కోచింగ్ హైదరాబాదులో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం ఉన్నవారు వచ్చేనెల ఏడు లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రతిభ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఐదువేల స్పైఫండ్ పుస్తక నిధి కోసం 5000 ఆర్థిక సాయం ఉచిత స్టడీ మెటీరియల్ ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.






