16 July, 2026 | 6:38 PM

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పోస్టుల భర్తీకి చర్యలు

16-07-2026 06:16 PM

- టీజీఎస్డబ్ల్యు ఆర్ఐఈఎస్ సమన్వయకర్త కోటూరి రామ కళ్యాణి

మంచిర్యాల క్రైం,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకులాలల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామమని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఈ ఎస్ కో ఆర్డినేటర్ (సమన్వయకర్త) కోటూరి రామ కళ్యాణి గురు వారం తెలిపారు. జిల్లాలోని 9 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు తాత్కాలిక బోధనా సిబ్బంది ఎంపిక కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.

సైన్స్, ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు తాత్కాలిక పద్ధతిన జూనియర్ లెక్చరర్, పిజిటి, టిజిటి, స్పెషల్ టీచర్ల కోసం ఈ నెల 23న సాయంత్రం 4 గంటల్లోగా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, 25న జూనియర్ లెక్చరర్, పిజిటి క్యాడర్ ఖాళీలకు, 27న టిజిటి, స్పెషల్ టీచర్ క్యాడర్ కు ఉదయం 9 నుంచి తరగతి బోధన పరిశీలన ఉంటుందన్నారు.

జూనియర్ లెక్చరర్, పిజిటి పోస్టులకు యుజిసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పి.జి. డిగ్రీతో పాటు బి.ఈడి. అర్హత, టి జి టి పోస్ట్ కు యు జి సి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి బిఎస్, బిఎ, బికాం డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో పాటు బిఈడి అర్హత ఉండాలన్నారు. అభ్యర్థులు పూర్తి బయోడేటా తో పాటు విద్యార్హతలను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఒక జత నకలు ప్రతులను తీసుకొని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో హాజరుకావాలని కోరారు. బాలికల విద్యాలయాలలో పనిచేయడానికి మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులని, ప్రకటించబడిన ఖాళీలలో ఎంపిక కమిటీ నిర్ణయానికి లోబడి మార్పులు ఉండవచ్చన్నారు. 

జిల్లాలో 40 పోస్టులు ఖాళీలు

జిల్లాలో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఈ ఎస్ సమన్వయకర్త కోటూరి రామ కళ్యాణి తెలిపారు. పురుషులకు జూనియర్స్ లెక్చరర్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, పి.జి.టి. విభాగంలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్ లో ఒక్కొక్క పోస్టు, ఇంగ్లీష్ లో 2 పోస్టులు, టి.జి.టి. విభాగంలో బయో సైన్స్ ఒక్క పోస్టు, పార్ట్ టైం హిందీ లో 4 పోస్టులు, ఆర్ట్ టీచర్ 2 పోస్టులు, లైబ్రరీ ఒక పోస్టు ఉన్నాయన్నారు.

మహిళలకు జూనియర్ లెక్చరర్ విభాగంలో ఇంగ్లీష్, కెమిస్ట్రీ, సివిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 2 పోస్టులు, పి.జి.టి. విభాగంలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, టి.జి.టి. విభాగంలో మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీ లలో ఒక్కొక్క పోస్టు, హిందీ పార్ట్ టైం 4 పోస్టులు, పి.ఈ.టి./ పి.డి. 2 పోస్టులు, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రరీయన్, స్టాఫ్ నర్స్ లలో ఒక్కొక్క పోస్టు ఉన్నాయన్నారు. జూన్ 27న లక్షెట్టిపేటలో నిర్వహించిన పార్ట్ టైం టీచర్స్ ఎంపిక డెమోకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.