17 July, 2026 | 12:40 AM

గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ చర్యలు

17-07-2026 12:00 AM

ఓ డీమెరిట్ పాయింట్ కేటాయింపు

ఎడ్జ్‌బాస్టన్, జూలై 16 : భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొలి వన్డేలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తూ, అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బ్రార్ బౌలింగ్‌లో భారీ సిక్స ర్ బాదాడు. ఆ మరుసటి బంతిని ఫాలో త్రూ సమయంలో అందుకున్న బ్రార్, ఆవేశంతో డకెట్ వైపు వేగంగా విసిరాడు.

డకెట్ అప్రమత్తంగా తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ, బ్రార్ చర్యను ప్రమాదకరంగా పరిగణించి ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. బ్రార్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తెలి పారు. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆట గాడిపై లేదా అతడి సమీపంలో ప్రమాదకరంగా బంతిని విస రడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు.

బ్రార్ తన తప్పును అంగీకరిం చడంతో విచారణ అవసరం లేకుండా కేసు ను ముగించారు. ఈ ఘటనకు సంబంధించి గుర్నూర్‌కు ఎలాంటి జరిమానా విధించలేదు. ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికిది తొలి క్రమశిక్షణా ఉల్లంఘన.