అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేస్తాం
బోథ్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు.గురువారం సోనాల మండలంలోని సాకేర గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుడు రాథోడ్ సుజాత రంజిత్ నిర్మించుకున్న నూతన గృహప్రవేశాన్ని గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారందరికీ భవిష్యత్తులో ఇండ్లు మందిర అవుతాయన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజుయాదవ్, సోనాల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వినోద్, సర్పంచులు పూజా సంగ్రం, శ్రీరామ్ ,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణ సింగ్ ,డిసిసి డైరెక్టర్లు పోశెట్టి, హరి సింగ్ ,మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న ,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు






