16 July, 2026 | 6:29 PM

సర్ పత్రాలను అందజేసిన బిజెపి నేత

16-07-2026 06:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌లోని తన నివాసంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లకు ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఓటరు జాబితా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫామ్ ను సకాలంలో సమర్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు.