17 July, 2026 | 12:15 AM

అదరగొట్టిన అర్జెంటీనా

17-07-2026 12:09 AM
  1. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్
  2. చెదిరిన ఇంగ్లాండ్ కల
  3. మరో వరల్డ్‌కప్‌పై మెస్సీ కన్ను

అట్లాంటా, జూలై 16 : సాకర్ ప్రపంచకప్ క్లుమైక్స్‌కు చేరింది. ఊహించినట్టుగానే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో టైటిల్‌పై కన్నేసిన మెస్సీ టీమ్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి స్పెయిన్‌తో తుది సమరానికి రెడీ అయింది. అట్లాంటా స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ అభిమానులను ఉర్రూతలూగించింది. తమను ఛాంపియన్ టీమ్ అని ఎం దుకంటారో అర్జెంటీనా మరోసారి రుజువు చేసింది.

సెకండాఫ్ చివర్లో అద్భుతంగా పుం జుకున్న మెస్సీ అండ్ కో గెలుపుపై ధీమాగా ఉన్న ఇంగ్లాండ్‌కు ఊహించని షాకిచ్చింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి స్టేడియం లో ఇరు దేశాల అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత, విపరీతమైన కోలాహలం నెలకొంది. మూడో నిమిషంలో ఎంజో ఫెర్నాం డెజ్ చేసిన ఫౌల్‌తో వాగ్వాదం మొదలైంది. ఇంగ్లాండ్ జట్టు లియోనెల్ మెస్సీని ముట్టడించి స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఏ మాత్రం ఇవ్వలేదు.

అర్జెంటీనాకు చెందిన మార్టినెజ్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇలియట్ అండర్సన్ కూడా యెల్లో కార్డులు అందుకున్నారు.ఫస్టాఫ్‌లో ఎటువంటి గోల్స్ నమోదు కాలేదు. సెకండాఫ్‌లో 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు మోర్గాన్ రోడ్జర్స్ అందించిన అద్భుతమైన పాస్‌ను ఆంథోనీ గోర్డాన్ అద్భుతంగా గోల్‌గా మలిచి 1--0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనాపై ఒత్తిడి మొదలైంది. సమయం గడుస్తున్న కొద్దీ ఇం గ్లాండ్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు.

ఈ దశలో దిగ్గజ ఆటగాడు లియో నెల్ మెస్సీ తన మ్యాజిక్ చూపించాడు. 85 వ నిమిషంలో డిఫెండర్లను తప్పించుకుని బంతిని ఎంజో ఫెర్నాండెజ్‌కు పాస్ చేశాడు. ఫెర్నాండెజ్ బాక్స్ బయటి నుంచి బుల్లెట్ లాంటి షాట్ కొట్టడంతో స్కోరు 1--1తో స మమైంది. మ్యాచ్ అదనపు సమయం వైపు వెళుతున్నప్పుడు ఇంజ్యూరీ టైమ్‌లో మెస్సీ మరో పాస్ ఇవ్వగా.. లౌటారో మార్టినెజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా దానిని గోల్గా మలిచాడు.

కేవలం 7 నిమిషాల్లోనే స్కోరు 1--0 నుంచి 2--1కి మారిపోయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత మెస్సీ ఉద్వేగానికి లోనయ్యాడు. మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన జట్టుచేత గోల్స్ చేయించడంపైనే ఫోకస్ పె ట్టాడు. అర్జెంటీనా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది రెండోసారి. ఆదివారం జరిగే ఫైనల్లో అ ర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. కాగా అర్జెంటీనా 1978,1986,2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది. 1930,1990.2014 ఎడిషన్లలో రన్నరప్‌గా నిలిచింది.