గుండె జబ్బులుంటే ఆమెన్ చూడొద్దు!
ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రేగుల నీరజరాణి సమర్పణలో ఆర్‌ఎన్‌ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆమెన్’. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శక నిర్మాత ఎస్‌కే బషీద్ ఇప్పుడు ‘ఆమెన్’ సినిమాతో వస్తున్నారు.
ఈ సినిమా గురించి ఎస్‌కే బషీద్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌కు పూర్తిగా మార్చేలా ‘ఆమెన్’ రూపొందించాం. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం.. గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు.
ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అన్నారు.






