17 July, 2026 | 12:03 AM

చిక్కుల్లో అర్జెంటీనా ఆటగాళ్లు

17-07-2026 12:03 AM
  1. స్టేడియంలో వివాదాస్పద బ్యానర్ ప్రదర్శన
  2. చర్యలు తీసుకోనున్న ఫిఫా

అట్లాంటా, జూలై 16 : ఇంగ్లాండ్‌ను ఓడించి సాకర్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు వి వాదంలో చిక్కుకుంది. ఆ జట్టు ప్లేయర్లు వివాదాస్పద రీతిలో బ్యానర్లు ప్రదర్శించారు. సెమీస్‌లో గెలిచిన తర్వాత సంబరా లు జరుపుకునే క్రమంలో ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఫాక్‌ల్యాండ్స్‌కు మద్ధతు ఇచ్చే రీతిలో ఉన్న బ్యానర్‌ను ఆటగాళ్లు పట్టుకున్నారు. దీనిపై వివాదం చెలరేగింది. ఆ బ్యాన ర్‌లో లాస్ మాల్వినాస్ సన్ అర్జెంటీనాస్ అని రాసి ఉంది.

అర్జెంటీనాకే ఫాక్‌ల్యాండ్స్ చెందుతాయని అర్థం. అట్లాంటిక్ సముద్రం లో ఉన్న ఫాక్‌ల్యాండ్స్ దీవులు ఒకప్పుడు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఆ దీ వులు తమకే చెందుతాయని అర్జెంటీనా పోరాడుతోంది. 1982లో ఈ దీవుల కోసం యూకేతో భీకర యుద్ధం జరగగా 900 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి యుద్ధంలో యూకేదే పైచే యి కావడంతో తర్వాత సంధి కుదిరింది.   

ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ ర్లు బ్యానర్లు ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఫిఫా నిబంధనల ప్రకారం మైదానంలో ఎలాంటి రాజకీయ, మతపరమైన, వ్యక్తిగత ప్రదర్శనలు చేయకూడదు. ఆటగాళ్ల లోదుస్తులపై సైతం తయారీ లోగో తప్పిస్తే మరే చిత్రాలు ఉండొద్దు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన జట్లు లేదా ఆటగాళ్శపై ఫిఫా ఆంక్షలు విధించే అవకాశముంటుంది.