‘కనకరాజు’.. రాసగుమ్మడి!
17-07-2026 12:23 AM
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రాసగుమ్మడి’ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మేరకు హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో విడుదల చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్ వైబ్‌ను క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: మనోజ్‌రెడ్డి కటసాని.






