3 March, 2026 | 3:31 PM

మాదారంలో కారోబార్ ఇష్టారాజ్యం !

03-03-2026 01:16 PM

ఉదయానికి బ‌దులు మ‌ధ్యాహ్నం ట్యాంక‌ర్ స‌ర‌ఫ‌రా 

ఇదేమిట‌ని ప్ర‌శ్నిస్తే దుర్భాష‌లాడుతున్న వైనం

జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్(Gaddapotharam Municipal) పరిధిలోని మాదారం గ్రామంలోని 12వ వార్డులో గత ఆరు రోజుల నుండి మంచినీటి సమస్య(Drinking Water Problem) ఏర్ప‌డింది. మున్సిప‌ల్ అధికారులకు వార్డు స‌భ్యులు విన్నపించుకోగా కమిషనర్ వాటర్ ట్యాంకర్ పంపించడం జరుగుతుంది. అయితే వాట‌ర్ ట్యాంక్‌ను మ‌హిళ‌లంతా విధుల‌కు వెళ్ళిన స‌మ‌యంలో మ‌ధ్యాహ్నం ట్యాంక‌ర్ పంపించ‌డం వ‌ల్ల ఎవ‌రూ నీటిని ప‌ట్టుకోవ‌డం లేదు.

దీంతో సాయంత్రం మ‌ళ్ళీ నీటి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఈ విష‌యంలో కారోబార్ న‌ర్సింగ్‌ను మ‌హిళ‌లు అడుగగా అత‌ను దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ తాను ఇష్టం వ‌చ్చిన‌ప్పుడే పంపిస్తాన‌ని త‌న ఇష్టం అంటూ దుర్భాష‌లాడుతున్నాడ‌ని వాపోయారు. వేస‌వి స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మంచినీటి స‌మ‌స్య ఏర్ప‌డుతున్న దృష్ట్యా ఉద‌యం వేళ‌ల్లోనే ట్యాంక‌ర్‌ను పంపించాల‌ని వార్డు ప్ర‌జ‌లు కోరుతున్నారు. కారోబార్ న‌ర్సింగ్(Nursing) వ్య‌వ‌హారంపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ళ‌గా స‌మ‌స్య రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీనిచ్చారు.