3 March, 2026 | 2:18 PM

జడ్చర్ల ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

03-03-2026 01:11 PM
  1. సూపర్డెంట్ తో పాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ 
  2. మార్చురీలో శవాన్ని పీకత్తిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ 
  3. చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 
  4. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

జడ్చర్ల: మరణించిన వ్యక్తి శవాన్ని పోస్టుమార్టం చేసేందుకు గదిలో ఉంచడంతో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో(Jadcherla Government Hospital) చోటు చేసుకున్న విషయం విధితమే. ఈ విషయంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనువెంటనే సంబంధిత అధికార యంత్రం విచారణ చేపట్టింది.

ఈ ఘటనలో నలుగురు అధికారులని సస్పెండ్ చేయడం జరిగిందని హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్ అజయ్ కుమార్(Health and Family Commissioner Ajay Kumar) తెలియజేశారు. సూపరింటెండెంట్( Superintendent suspended) చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, ఎంఎన్ఓ రవి ప్రకాష్,డ్యూటీ డాక్టర్ మునిషా లను సస్పెండ్ చేశారు.  ఈ ఘటనకు బాధ్యులైన అందరిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వానికి మరోమారు విన్నవించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ప్రకటనలో పేర్కొన్నారు. 

ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే : మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి




ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే శివాని కుక్కలు పిక్క తినడం జరిగిందని మాజీ మంత్రి డాక్టర్ సీ. లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం జడ్చర్ల లోని ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి(Former Minister Lakshma Reddy) పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని నూతన మార్చురుని నిర్మించడం జరిగిందని, ఆ భవనాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇలాంటి ఘటన జరిగిందని అన్నారు. నిరుపేదల కు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తుందని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు ప్రజలకు భరోసా ఇచ్చే పరిపాలన అందించాలని స్పష్టం చేశారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ తప్పిదమైనని, పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.