రాష్ట్రంలో మొట్టమొదటి సోలార్ ప్రాజెక్ట్..
- సోలార్ పవర్ ప్లాంట్ పనుల
- పురోగతిని తనిఖీ చేసి కలెక్టర్ దివాకర టిఎస్.
ఎర్రుపాలెం మే 8 (విజయ క్రాంతి): లాభంతో కూడిన వ్యాపారం సృష్టించుకొని మరొకరికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని, ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. శుక్రవారం ఎర్రుపాలెం మండలం, రాజుపాలెం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద నిర్మాణంలో ఉన్న ఒక మెగావాట్ సామర్థ్యపు సోలార్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. సౌర విద్యుత్ ప్లాంట్లో జరుగుతున్న నిర్మాణ పనులు, సాంకేతిక అంశాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ప్రస్తుత పనుల పురోగతిని కలియతిరుగుతూ పరిశీలించారు.
ఇంజనీర్స్, ప్లాంట్ నిర్మాణం, భవిష్యత్ విద్యుత్ సరఫరా అంశాలను జిల్లా కలెక్టర్ కు అధికారుల వివరించారు. ఖమ్మం జిల్లా మహిళ సమైక్య సభ్యురాలకు ఫ్లాంట్ నిర్వాహణ, ఆదాయం, వ్యయం, ఋణం తీర్చడం, పొదుపు, ఇతర మహిళాలకు ఉపాది అదాయం కల్పించడం పై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడంతో పాటు మహిళా సాధికారతకు బలమివ్వడం పథకం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చే త్వరలో ప్రారంభించుకొనే పవర్ ప్లాంట్కు అవసరమైన అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఆనతరం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ఇందిరా మహిళా డెయిరి ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సందర్శించారు. పాల సేకరించే విధానం, నాణ్యత ప్రమాణాల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మహిళా శక్తి యూనిట్ ల గ్రౌండింగ్ తో పాటు అవి విజయవంతంగా నడిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలు, చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని ఆదేశించారు.డిఆర్డీవో కొండపల్లి శ్రీరామ్, రెడ్కో డిస్ట్రిక్ట్ మేనేజర్ పి. అజయ్ కుమార్, డిఆర్డీవో ఎపిడి జయశ్రీ, ఏడిఏ విజయచందర్, ఎర్రుపాలెం తహసీల్దారు ఉషాశారద, ఏఎంసి చైర్మన్ బండారు నర్సింహారావు, సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, చైతన్య మహిళా సంఘం బాధ్యులు పాల్గొన్నారు.






